ఏజెంట్‌ చేతిలో మోసపోయిన 35 మంది భారతీయ వలసదారులు

ఏజెంట్‌ చేతిలో మోసపోయిన 35 మంది భారతీయ వలసదారులు

భారతదేశంలోని కర్నాటకకు చెందిన 35 మంది భారతీయ కార్మికులు ఎంప్లాయ్‌మెంట్‌ ఫ్రాండ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా కువైట్‌కి తాము వెళ్ళినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి దగ్గరనుంచి సదరు సంస్థ 65,000 రూపాయలు వసూలు చేసిందని చెప్పారు బాధితులు. కువైట్‌ చేరుకున్న తర్వాతగానీ బాధితులకు తాము మోసపోయిన విషయం తెలియలేదు. ఆరు నెలలుగా కువైట్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, తకు జీతాలు సరిగ్గా రాలేదని బాధితులు పేర్కొంటున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. కంపెనీ తమను మోసం చేసిందనీ, కువైట్‌ జైళ్ళలో మగ్గేలా చేస్తామని బెదిరిస్తోందనీ వాపోయారు. విధి నిర్వహణలో నలుగురు కార్మికులు గాయపడినా, వారిని కంపెనీ ఆదుకోలేదని ఓ బాధితుడు చెప్పారు. బాధితుల వెతలకు సంబంధించిన వీడియో చూసిన మంగళూరు సౌత్‌ ఎమ్మెల్యే వేద వ్యాస్‌ కామత్‌, వారికి సాయం చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. బాధితులంతా మంగళూరుకి చెందినవారే. 

Back to Top