దుబాయ్ వలసదారుడి కుమారుడికి మోడీ పేరు
- May 28, 2019
భారత వలసదారుడు ముస్తాక్ అహ్మద్, తన కుమారుడికి నరేంద్ర మోడీ అనే పేరు పెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన చిన్నారిని ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నారాయన. ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి నరేంద్ర మోడీ రావాలనీ, తమ చిన్నారి మోడీని ఆశీర్వదించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారుఅ హ్మద్. దుబాయ్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలోగల హట్టాలోని ఓ ఇంటీరియర్ డెకార్ కంపెనీలో మెయిన్టెనెన్స్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు అహ్మద్. మే 23న తన భార్య తనకు కుమారుడు పుట్టాడనే సమాచారం అందించిందనీ, అప్పుడే తాను 'దేశంలో మోడీ మళ్ళీ వచ్చారు.. మన ఇంట్లోకి కూడా మోడీ వచ్చారు' అని చెప్పానని అన్నారు అహ్మద్ ఎంతో ఉద్వేగంగా. అహ్మద్ మరియు ఆయన భార్య బేగంకు చిన్నారి మోడీ మూడో సంతానం. ఉతరతప్రదేశ్లోని గోండాకి చెందిన ఈ ముస్లిం జంటకు మాతాజా, ఫాతిమా అనే కుమార్తెలు కూడా వున్నారు. 29 ఏళ్ళ అహ్మద్, ఐదేళ్ళ క్రితమే యూఏఈకి వచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







