ఇడుపులపాయ నుంచి యాత్ర-2 ప్రారంభం
- May 29, 2019
వైసీపీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తావన లేకుండా యాత్ర-2 కంప్లీట్ కాదని క్లారిటీగా చెప్తున్నాడు దర్శకుడు మహి వి.రాఘవ్.. వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా, మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా.. యాత్ర.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం సాధించిది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి, జగన్ సీఎంగా ఎంపికైన నేపథ్యంలో, యాత్ర దర్శకుడు మహి వి.రాఘవ్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ, త్వరలో యాత్ర-2 రానుందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా యాత్ర సీక్వెల్ గురించి మరిన్ని వివరాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు దర్శకుడు..
'వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్ లేకుండా వైఎస్సార్ కథకు ముగింపు ఉండదు. యాత్ర-2 ద్వారా వీరి ముగ్గురి కథ గురించి చెప్పి సినిమాకి ముగింపునిస్తాను.. యాత్రను జగన్ ప్రస్తావనతోనే ముగించేసాం, సెకండ్ పార్ట్‌లో జగన్ ప్రయాణం గురించి చూపించాలనుకునే అలా చేసాం.. వైఎస్సార్ యాత్ర ఆయన తండ్రి రాజా రెడ్డి సమాధి నుంచి మొదలైంది, జగన్ యాత్ర తన తండ్రి సమాధి నుంచి స్టార్ట్ అయ్యింది'.. అని మహి ట్వీట్ చేసాడు. జగన్ పాత్రలో ఆయన స్నేహితుడు, తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్నాడని తెలుస్తుంది. యాత్ర మూవీని నిర్మించిన విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ సినిమాని నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..