8 మంది మృతికి కారణమైన కువైటీ టీనేజ్ డ్రైవర్ అరెస్ట్
- May 29, 2019
కువైట్: చిన్న రోడ్డు ప్రమాదం జరగడంతో, అక్కడ గుమికూడి బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపైకి మరో వాహనం వేగంగా దూసుకురావడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కువైట్‌లో చోటు చేసుకున్న సంగతి తెల్సిందే. కబాద్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించి, 17 ఏళ్ళ కువైటీ డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయగా అందులో ముగ్గురు కువైటీలు, ముగ్గురు సౌదీలు ఓ బెడౌన్ మరియు ఇద్దరు ఓ గుర్తు తెలియని వ్యక్తి వున్నారు. పలువురు గాయాల బారిన కూడా పడ్డారు. అరెస్ట్ చేసిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు వుంటాయని అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డుపై ప్రజలు గుమి కూడడడం మంచిది కాదనీ, అదే సమయంలో రోడ్డుపై పరిమిత వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







