జీవీకే -ఈఎంఆర్‌ఐలో ఉద్యోగాలు

జీవీకే -ఈఎంఆర్‌ఐలో ఉద్యోగాలు

హైదరాబాద్ : జీవీకే -ఈఎంఆర్‌ఐ 108 కాల్ సెంటర్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్స్ నియామకానికి 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ సుహాస్ చరణ్ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులై, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి, 20 -28 ఏండ్ల మధ్య వయసు వారై, ఎంఎస్ ఆఫీస్, టైపింగ్ స్కిల్స్ వచ్చిన వారు అర్హులని తెలిపారు. మంచి శారీర ధారుడ్యం, 5.4 ఎత్తు, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ రాయడం, చదవడం వచ్చి ఉండాలని, ఎంపికైన వారు హైదరాబాద్‌లోని 108 కాల్ సెంటర్‌లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. వివరాల కోసం 040 -23462367, 7995061581 నంబర్లను సంప్రదించాలన్నారు.

Back to Top