సిరియాలో వైమానిక దాడి..14 మంది మృతి
- May 30, 2019
డమాస్కస్: సిరియాలో వైమానిక దాడిలో 14 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిరియాలోని మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ చీఫ్ రామి అబ్దెల్‌రహ్మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం...తిరుగుబాటుదారుల జనాభా అధికంగా ఉన్న ఇద్లిబ్ ప్రావిన్స్‌లో బుధవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ దాడికి పాల్పడినట్టు ఏ సంస్థ కూడా ప్రకటించుకోలేదు. అయితే, ఇద్లిబ్‌లోని తిరుగుబాటుదారుల తరిమివేత కోసం సిరియా బలగాలు కొంతకాలంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వైమానికదాడికి పాల్పడింది సిరియా సైన్యమేనని అబ్దెల్ రహ్మాన్ అనుమానిస్తున్నారు. కాగా, ఇద్లిబ్ ప్రావిన్స్‌లో సిరియా బలగాలు వైమానిక దాడికి పాల్పడ్డా యని వచ్చిన ఆరోపణలను అస్సద్ సర్కార్ ఖండించలేదు. ఇద్లిబ్‌లో అక్రమ చొరబాటుకు ప్రయత్నిస్తున్న హయాత్ తహ్రీర్ అల్ షామ్ తిరుగుబాటుదారులను తరిమివేస్తామని సిరియా ఆర్మీ గతనెలలో ప్రకటించింది. సిరియాలో జరిగిన వైమానికదాడిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా బలగాలకు, తిరుగుబాటుదారులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర పోరులో సామాన్య పౌరులు సమిధలవు తున్నారని తెలిపింది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈఏడాది ఏప్రిల్30నాటికి 3.7లక్షల మంది మృతిచెందినట్టు ఐరాస వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







