రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం

- May 30, 2019 , by Maagulf
రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: నేడు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనిరీతిలో అతిపెద్ద వేడుకగా ప్రధాని ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుంది. వివిధ దేశాధినేతలు, గత కేబినెట్ లోని మంత్రులు, దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరూ కలుపుకుని దాదాపు 8 వేల మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. దీంతో ఢిల్లీ మొత్తం దాదాపు 10,000 పైగా మందితో భద్రతా బలగాలను మొహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాత్రి 7 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగనుండగా ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖులకు భద్రత కల్పిస్తూ ఇప్పటికే ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు బందోబస్తులో పాల్గొని ఢిల్లీని అనుక్షణం పహారా కాస్తున్నాయి.

ప్రమాణస్వీకారం నేపథ్యంలో నరేంద్ర మోదీ నేడు రాజ్ ఘాట్, సదైవ్ అటల్ సమాధి, నేషనల్ వార్ మెమొరియల్ వంటి పవిత్ర స్థలాలకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే ప్రధానికి భారీ భద్రత కల్పిస్తూ ఎత్తైన భవనాలపై నుంచి స్పైపర్స్, షార్ప్ షూటర్స్ సైతం బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com