700 మంది కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన షార్జా చర్చ్
- May 31, 2019
షార్జా:చర్చిలో పెళ్ళిళ్ళు జరగడం మామూలే. కానీ, ఓ చర్చి ముస్లిం సమాజానికి సంబంధించిన ఈవెంట్‌ని నిర్వహించడం సాధారణ విషయమైతే కాదు. షార్జాలోని సెంట్ మైఖేల్ చర్చ్ 700 మంది బ్లూ కాలర్డ్ వర్కర్స్‌కి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు చెందిన 30 కేథలిక్ వాలంటీర్స్ ఈ ఇఫ్తార్ విందుకు సహాయ సహకారాలు అందించారు. 1971లో ఈ చర్చ ఏర్పాటయ్యింది. 'ఇయర్ ఆఫ్ మెర్సీ'గా ఈ ఏడాదిని పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించిన దరిమిలా, ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏడు పెద్ద టేబుల్స్ లైన్స్‌లో కూర్చున్న కార్మికులు, డేట్స్, వాటర్, బిర్యానీతో తమ ఫాస్టింగ్ని ముగించారు. ఆకలికి మతంతో సంబంధం లేదనీ, ప్రేమాభిమానాల విషయంలో మతాల మధ్య తేడాలకు తావు లేదని పరస్పర సహకరమే మానవ జాతికి ఔన్నత్యం కలిగిస్తుందని ఈ సందర్భంగా కార్మికులు, నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







