ఫేక్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలపై ఇండియన్‌ ఎంబసీ హెచ్చరిక

- May 31, 2019 , by Maagulf
ఫేక్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలపై ఇండియన్‌ ఎంబసీ హెచ్చరిక

కువైట్‌:కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసీ, ఫేక్‌ రిక్రూట్‌మెంట్‌ ఎజెన్సీలు అలాగే కంపెనీల పట్ల అప్రమత్తంగా వుండాలని తమ పౌరుల్ని హెచ్చరించింది. ఉద్యోగాలు చూపిస్తామంటూ వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, పూర్తిస్థాయి సమాచారాన్ని పరిశీలించాకనే ఆయా సంస్థల్ని ఆశ్రయించడం మేలని ఎంబసీ ఓ ప్రకటనలో సూచించింది. రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు, కంపెనీలకు సంబంధించి ఎంబసీ, తన వెబ్‌సైట్‌లో కొన్ని వివరాలు పొందుపరిచిందనీ, అందులో తగిన వివరాలు లభ్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. జాబ్‌ ఆపర్చ్యూనిటీస్‌ వెరిఫై చేసుకోవడానికి ఓ వెబ్‌సైట్‌ కూడా అందుబాటులో వుందని ఆ వివరాల్నీ ఎంబసీలో చెక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇండియన్‌ ఎంబసీ కువైట్‌ని సంప్రదిస్తే, ఎలాంటి సమస్యలూ వుండవని ఎంబసీ చెబుతోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com