మసీదుల మరమ్మత్తుల కోసం 5కోట్లు విడుదల చేసిన జగన్
- June 01, 2019
అమరావతి:రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ.. ఎపి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా నిర్వహించుకోవచ్చని ఎపి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. శనివారం ఉదయం ఎపి ఆర్థిక శాఖ ఉన్నతాధికారు లతో సిఎం జగన్ సమీక్షా నిర్వహించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, ఖర్చులు, పెండింగ్ బిల్లులు సహా పలు అంశాలపై జగన్ చర్చించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







