హైదరాబాద్ లో లవ్ జిహాద్ వార్తలు కలకలం
- June 01, 2019
హైదరాబాద్ లో లవ్ జిహాద్ వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రేమ పేరుతో తమ అమ్మాయిని మోసం చేసి … మత మార్పిడి చేశారని పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు తల్లిదండ్రులు. రాత్రి అమ్మనాన్నను చూడాలని ఉందంటూ మెసేజ్ పంపిందని.. ఆ తర్వాత నుంచి తమ కూతురు ఇందిర అందుబాటులో లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు తమ అమ్మాయి బతికి ఉందో లేదో అన్న అనుమానం కలుగుతోందని చెప్పారు.
మంచిర్యాలకు చెందిన ఇందిర అలియాస్ జుబేరా టెక్ మహేంద్రలో పనిచేస్తోంది. ఈమెకు కరీనంగర్ కు చెందిన రిజ్వాన్ తో 2018 జులైలో వివాహం అయింది. రిజ్వాన్ గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కరీనంగర్ లోని వివేకానంద కాలేజ్ లో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్ లోనే ఉంటోంది ఇందిర…
అయితే తమ అమ్మాయికి బలవంతంగా మత మార్పిడి చేశారని ఇందిర తల్లిదండ్రులు రేణుక, మహేష్ ఆరోపిస్తున్నారు. రిజ్వాన్.. లవ్ జిహాద్ పేరుతో తమ అమ్మాయిని ట్రాప్ చేశాడని ఆరోపించడం సంచలనంగా మారింది. కొంతకాలంగా ఇందిర తమ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో సిరియాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. రిజ్వాన్ కు పంజాగుట్ట ఎస్సై జావెద్ మద్దతు పలుకుతున్నాడని… పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. .
అయితే ఇందిర తల్లిదండ్రులు రేణుక, మహేష్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు పోలీసులు… ఇష్టపూర్వకంగానే రిజ్వాన్ ను వివాహం చేసుకున్నట్లు ఇందిర తమకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిందని పంజాగుట్టు ఏసీపీ తిరుపతన్న స్పష్టం చేశారు.. అయినప్పటికీ తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేసేందుకు విచారణ చేస్తామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







