ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
- June 02, 2019
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!







