అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు ఇవ్వాల్సిందే
- June 02, 2019
వాషింగ్టన్:వీసాల జారీ విషయంలో అమెరికా మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసే వారు తమ సామాజిక మాధ్యమాల వివరాలు కూడా జత చేసేలా కొత్తనియమాలను తీసుకొచ్చింది. నిజానికి ఈ నియమం గురించి గతేడాదే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రజాభిప్రాయం సేకరించి ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నియమం ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం చూపనుంది. అయితే ఈ నియమం నుంచి ద్వైపాక్షిక, అధికారిక వీసాదార్లకు మినహాయింపు ఉంటుంది. ఉద్యోగం, విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వారు మాత్రం తప్పని సరిగా సోషల్ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే.
కొత్త నిబంధలన ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు సామాజిక మాధ్యమాలను వారు ఏ పేరు మీద ఉపయోగిస్తున్నారో వెల్లడించాలి. దీంతో పాటు ఐదేళ్లపాటు ఈమెయిల్ ఐడీ రిపోర్టు కూడా ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వారి అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇంతకు ముందు నిబంధనల ప్రకారం వీసా అభ్యర్థులకు ఉగ్ర ముఠాలతో సంబంధాలున్నాయా అనే కోణంలో మాత్రమే విచారణ చేపట్టేవారు. ఇప్పుడు నిజమైన అభ్యర్థులను గుర్తించేందుకు సోషల్ మీడియా ఖాతాల ఆధారంగానూ విచారణ చేపడతారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..