'భారత్' సినిమా రిలీజ్ పై ఉత్కంఠ
- June 03, 2019
న్యూఢిల్లీ:బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీ విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. దేశం పేరుతో రూపొందిన ఈ సినిమా దేశ సాంస్కృతిక, రాజకీయ ప్రతిష్టను మసకబార్చేలా ఉందన్న పిటిషనర్ ఆరోపణలపై విచారణకు హైకోర్టు ముందుకొచ్చింది.
జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తమ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల వినతిని జస్టిస్ జేఆర్ మిధా, జస్టిస్ చందర్‌శేఖర్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ అంగీకరిస్తూ దీనిపై ఈరోజే విచారిస్తామని పేర్కొంది. ఎంబ్లమ్స్, నేమ్స్ చట్టం ప్రకారం భారత్ పేరును ఎలాంటి వ్యాపారం, వర్తకం, వృత్తి లేదా ట్రేడ్‌మార్క్, పేటెంట్‌లాగా వాడుకోవడం నిషిద్ధమని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం 'భారత్' దేశ అధికారిక నామమని, ఈ పేరుతో సినిమా టైటిల్ సరైంది కాదని పిటిషనర్ వికాస్ త్యాగి నివేదించారు. సినిమా విడుదలపై మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..