ఈద్ వీకెండ్లో వర్షం కురిసే ఛాన్స్
- June 05, 2019
40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ప్రస్తుతం యూఏఈలో నమోదవుతున్నా, ఈ సీజన్లోనూ కొంత ఉపశమనం పొందేందుకు అవకాశాలున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ చెబుతోంది. కన్వెక్టివ్ క్లౌడ్స్ ఫార్మేషన్కి అవకాశం వుందనీ, ఈ కారణంగా కొంత వర్షపాతం నమోదవ్వచ్చనీ ఎన్‌సిఎం పేర్కొంది. వీకెండ్లో పగటిపూట వాతావరణం కొన్ని చోట్ల పాక్షికంగా మేఘావృతమై వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ వివరించింది. లైట్ నుంచి మోడరేట్ విండ్స్ కారణంగా డస్ట్ అలాగే శాండ్ బ్లోయింగ్కి అవకాశం వుంది. దాంతో మోటరిస్టులకు ఇబ్బందులు తప్పవు. యూఏఈలోని చాలా ఎమిరేట్స్‌లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 వరకు నమోదవుతాయి. అత్యల్పంగా జూన్ 5న ఉదయం 8 గంటలకు 24.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత రక్నాహ్ రీజియన్‌లో నమోదయ్యింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..