ఏ.పి,తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ వాతావరణం
- June 05, 2019
భారత దేశవ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి.. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గల్ఫ్ దేశాల్లో నిన్ననే పండగ జరుపుకున్నా.. మన దగ్గర నిన్న నెలవంక కనిపించడంతో ఇవాళే ఈద్-ఉల్-ఫితర్‌గా ఇమామ్‌లు ప్రకటించారు. దీంతో మంగళవారంతో ఉపవాస దీక్షలు ముగించారు. ఇవాళ సామూహికంగా జమాత్‌లు నిర్వహించారు.. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు చోట్ల వేలాదిమంది ఈద్గాల వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు.
నెల రోజులుగా ఇఫ్తార్ విందులు కూడా తెలుగు రాష్ట్రాల్లో పండగవాతావరణంలో జరిగాయి. ప్రభుత్వాలే కాదు.. కొందరు ముఖ్యులు కూడా ప్రత్యేకంగా విందు ఇచ్చారు. నిన్నటితో ఉపవాస దీక్షలు ముగియడంతో.. మసీదులు, ఈద్గాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముస్లింలు పరమ పవిత్రంగా భావించే ఖురాన్ ఈ పవిత్ర రంజాన్ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్తారు. చెడును పూర్తిగా వదిలిపెట్టి సన్మార్గంవైపు నడవాలన్న ఉద్దేశంతోనే ఈ ఉపవాస దీక్షలు చేస్తారు. శక్తిమేరకు దానాలు చేస్తారు. ఇలా ఈ నెలంతా ముస్లింలకు ఎంతో ప్రత్యేకం. పండుగ ముగింపు సందర్భంగా.. నోరూరించే ప్రత్యేకమైన వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఆత్మీయులకు, మిత్రులకు ఖీర్ పంచుతూ శుభాకాంక్షలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







