ఈజిప్టులో ఉగ్రదాడి..
- June 05, 2019
ఈజిప్ట్:సినాయీ ద్వీపకల్పంలోని ఓ చెక్ పాయింట్ వద్ద బుధవారం ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అధికారులు మీడియాకు తెలిపారు. ఆ దాడిలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు. రంజాన్ సందర్భంగా ఈల్ అరీష్ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ రోజు ఉదయం చెక్ పాయింట్ వద్ద ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది సాధారణ పోలీసులు ఉన్నట్లు వారు నిర్ధరించారు.
ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. చెక్ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు తెలిపారు. ఉత్తర సినాయీ ఆధారిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో ఈజిప్ట్ బలగాలు కొన్నేళ్లుగా పోరాడుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..