మోదీ యోగా పాఠాలు.. వీడియో వైరల్
- June 07, 2019
ఆరోగ్యం అందరికీ చాలా అవసరం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. ప్రతి రోజూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంటారు ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ. జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తింపు తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వం. యోగా గురు బాబా రాందేవ్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిస్తుంటారు ఆయన. ప్రధాని యోగా గురుగా మారి పోయి ట్విట్టర్లో ఓ వీడియోని షేర్ చేశారు.
యానిమేషన్ రూపంలో కనిపిస్తున్న ఆయన తాడాసనం ఎలా వెయ్యాలో చెబుతూ.. దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగాపై అందరికీ ఆసక్తి కలిగేలా ఈ వీడియోని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీన్ని 37 వేల మంది లైక్ చేయగా.. 7 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. మోదీ యానిమేషన్ వీడియోల కోసం ప్రత్యేక ఐటీ అధికారుల టీమ్ పనిచేస్తోంది. తాజా వీడియోలో ఉన్న తాడాసనం ప్రధాని రోజూ చేసే యాగాసనాల్లో ఒకటి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







