కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ..
- June 07, 2019
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పావు శాతం తగ్గించింది. ప్రతిసారి పావు శాతం 25 బేసిక్ పాయింట్లు చొప్పున తగ్గించడంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్న ఈ నిర్ణయంతో రెపో రేటు 10ఏళ్ల కనిష్టానికి చేరింది. మరోవైపు రివర్స్ రెపో రేటు బ్యాంక్ రేటును 5.50 నుంచి 6 శాతానికి పెంచింది. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది.
తాజా తగ్గింపుతో ఇంటి రుణంలో కాస్త రిలీఫ్ దొరకనుంది… ఉదాహరణకు ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్‌బీఐ నుంచి 20ఏళ్ల టర్మ్‌తో 30 లక్షల రూపాయల హోమ్ లోన్ తీసుకుంటే ఇప్పటి వరకు 8.6 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ 26వేల 225 రూపాయలయితే తాజా తగ్గింపుతో వడ్డీ రేటు 8.35కు తగ్గి, ఈఎంఐ 25వేల 751 రూపాయలు కానుంది. అలాగే పదేళ్ల టర్మ్‌తో 25 లక్షల రూపాయల హోమ్ లోన్ తీసుకుంటే ప్రస్తుత ఈఎంఐ 31 వేల 332 రూపాయలుంటే తాజా తగ్గింపుతో ఇది దాదాపు 30,996 గా ఉండవచ్చు. అంటే రుణమొత్తం పూర్తయ్యేనాటికి లెక్కిస్తే రుణ దాత కట్టాల్సిన మొత్తంలో దాదాపు 40వేల రూపాయలకుపైగా భారం తగ్గుతుంది.
ఈ తగ్గింపు రేట్లు వాహనాల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు ఏడేళ్ల టర్మ్‌తో 10 లక్షల రూపాయల కారు లోన్ తీసుకుంటే, ఈఎంఐ 16 వేల 89 రూపాయల నుంచి 15వేల 962 రూపాయలకి తగ్గుతుంది. ఆర్‌బీఐ నిర్ణయం వల్ల ఎంతో మంది మధ్య తరగతి వర్గానికి చెందిన ప్రజలకు మేలు జరగనుంది. మరి భవిష్యత్తులోనూ ఈ రేటు ఇదే విధంగా ఉంటుందా, లేదా అన్నది వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







