అబుధాబిలో మెగా ఈద్ సేల్‌కి పోటెత్తిన షాపర్స్
- June 08, 2019
అబుధాబి:క్యాపిటల్‌లోని దాదాపు అన్ని షాపింగ్ మాల్స్ ఈద్ సందర్భంగా షాపర్స్‌తో పోటెత్తాయి. భారీ డిస్కౌంట్లతో షాపింగ్ మాల్స్ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. యస్ మాల్, మెరీనా మాల్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మాల్, దల్మా మాల్, బవాదీ మాల్, హిలి మాల్ మరియు అల్ జిమి మాల్ అలాగే 500 స్టోర్స్ ఈ డిస్కౌంట్ సేల్స్‌లో పాల్గొన్నాయి. ప్రధానంగా అల్ వహ్దా మాల్, అబుదాబీ మాల్, ముష్రిఫ్ మాల్ భారీ డిస్కౌంట్ల కారణంగా సందర్శకులతో కిటకిటలాడాయి. రిటైలర్స్, చాలా ఉత్పత్తుల ధరల్ని తగ్గించి ఈద్ సందర్భంగా షాపర్స్ ఎక్కువగా వచ్చేలా చేసుకున్నారు. బట్టలు, షూస్, బ్యాగ్స్, జ్యుయెలరీ, పెర్ఫ్యూమ్స్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, హోమ్ వేర్, చిల్డ్రన్స్ టాయ్స్.. ఇంకా అనేక వస్తువుల్ని పెద్దయెత్తున కొనుగోలు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







