రాజు సుంద‌రం డైరెక్ష‌న్‌లో శ‌ర్వా

- June 10, 2019 , by Maagulf
రాజు సుంద‌రం డైరెక్ష‌న్‌లో శ‌ర్వా

సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారా? అంటే అవుననే స‌మాధానం విన‌ప‌డుతుంది. ప‌దేళ్ల‌కు ముందే ఈయ‌న ద‌ర్శ‌కుడిగా `నీవ‌ల్లే నీవ‌ల్లే` సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. తర్వాత కొరియోగ్రాఫ‌ర్‌గానే బిజీగా మారిపోయారు. అయితే మ‌ళ్లీ ఆయ‌న మెగాఫోన్ ప‌ట్టాల‌నుకుని ఓ క‌థ‌ను సిద్ధం చేసుకున్నారు.

రీసెంట్‌గా శ‌ర్వానంద్‌ను క‌లిసి లైన్ చెప్పార‌ట‌. పూర్తి స్క్రిప్ట్‌తో వ‌స్తే అప్పుడు ఆలోచిస్తాన‌ని శ‌ర్వా చెప్ప‌డంతో రాజు సుంద‌రం స్క్రిప్ట్‌ను రెడీ చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నార‌ట‌. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఏడాది చివ‌ర‌లో, లేక వ‌చ్చే ఏడాదో శ‌ర్వానంద్, రాజు సుంద‌రం క‌ల‌యిక‌లో సినిమా సెట్స్‌కు వెళుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com