రాజు సుందరం డైరెక్షన్లో శర్వా
- June 10, 2019
సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం త్వరలోనే దర్శకత్వం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. పదేళ్లకు ముందే ఈయన దర్శకుడిగా `నీవల్లే నీవల్లే` సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తర్వాత కొరియోగ్రాఫర్‌గానే బిజీగా మారిపోయారు. అయితే మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టాలనుకుని ఓ కథను సిద్ధం చేసుకున్నారు.
రీసెంట్గా శర్వానంద్‌ను కలిసి లైన్ చెప్పారట. పూర్తి స్క్రిప్ట్‌తో వస్తే అప్పుడు ఆలోచిస్తానని శర్వా చెప్పడంతో రాజు సుందరం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరలో, లేక వచ్చే ఏడాదో శర్వానంద్, రాజు సుందరం కలయికలో సినిమా సెట్స్‌కు వెళుతుంది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







