సెప్టెంబర్ 15 నుంచి ఢిల్లీ-చైనా మధ్య ఇండిగో విమానం...
- June 12, 2019
న్యూఢిల్లీ:తక్కువ ధరకు ఢిల్లీ-చైనాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ముందుకు వచ్చింది. ఢిల్లీ-చెంగ్డుల మధ్య సెప్టెంబర్ 15 నుంచి ప్రతి రోజూ నాన్-స్టాప్ విమానాలను నడపనున్నట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి విలియం బౌల్టర్ తెలిపారు. ఇది ఇండిగో చరిత్రలో మరో కీలక ఘట్టం అని ఆయన వ్యాఖ్యానించారు. చైనా విమానయాన మార్కెట్‌లోని ఇండిగో ప్రవేశం వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విమానయానానికి సంబంధించి రావాల్సిన అనుమతులు లభించగానే ఢిల్లీ-చెంగ్డుల మధ్య విమానాల రాకపోకలకు టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో ఇండిగో ముందడుగు వేస్తున్నదన్నారు. ఇక దేశంలోని డొమిస్టిక్ విమానాల్లో ప్రయాణికులకు అత్యధిక సేవలందిస్తున్నామని, డొమిస్టిక్ ప్రయాణికుల్లో 50 శాతం మంది ఇండిగో ప్రయాణికులే ఉన్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







