మస్కట్‌లో అగ్ని ప్రమాదం: నాలుగు ట్రక్కుల ధ్వంసం

మస్కట్‌లో అగ్ని ప్రమాదం: నాలుగు ట్రక్కుల ధ్వంసం

మస్కట్‌:మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదం నాలుగు ట్రక్కుల దహనానికి కారణమయ్యింది. పబ్లిక్‌ అతారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్సెస్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫైర్‌ ఫైటర్స్‌, అగ్ని కీలల్ని నియంత్రించేందుకు ప్రయత్నించారనీ, అయితే అప్పటికే వాహనాలు కాలి బూడిదయ్యాయని అధికారులు వెల్లడించారు. బౌషర్‌లోని గలా డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సంస్థకు చెందిన నాలుగు ట్రక్కులు కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.  

Back to Top