షూటింగ్‌లో శర్వానంద్‌కు ప్రమాదం!
- June 16, 2019
యంగ్ హీరో శర్వానంద్ గాయాలపాలయ్యాడు. స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. `96` షూటింగ్‌లో భాగంగా శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.
ట్రైనర్స్ ఆధ్వర్యంలో శర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేశాడు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు క్షేమంగానే ల్యాండ్ అయ్యాడు. అయితే ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువగా రావడంతో ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాళ్లపై ల్యాండ్ కావాల్సిన వ్యక్తి భుజాలను మోపి ల్యాండ్ అయ్యాడు. ఆ కారణంగా శర్వా భుజానికి గాయం అయ్యింది. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఘటన తర్వాత శర్వానంద్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. శర్వాను పరీక్షించిన డాక్టర్లు భుజానికి బలమైన గాయం తగలిందని, కాబట్టి శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. సోమవారం ఈ శస్త్ర చికిత్స జరగనుంది. ఆ తర్వాత కనీసం నాలుగు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







