దుబాయ్ లో 'డెక్కన్‌ హైదరాబాదీ దమ్‌ బిర్యానీ రెస్టారెంట్‌' వారి స్పెషల్ దమ్ బిర్యానీ

- June 17, 2019 , by Maagulf
దుబాయ్ లో 'డెక్కన్‌ హైదరాబాదీ దమ్‌ బిర్యానీ రెస్టారెంట్‌' వారి స్పెషల్ దమ్ బిర్యానీ

దుబాయ్:హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టపడనివారెవరుంటారు? ప్రపంచ వ్యాప్తంగా ఈ బిర్యానీకి బోల్డంతమంది అభిమానులున్నారు.గ్లోబల్ విలేజ్‌లో 17 ఏళ్ళుగా రుచిరకరమైన హైదరాబాదీ బిర్యానీని అందిస్తున్న డెక్కన్‌ హైద్రాబాదీ దమ్‌ బిర్యానీ రెస్టారెంట్‌, దుబాయ్‌లోని సెంచరీ మాల్‌ ఫుడ్‌ కోర్ట్‌లో కొత్త రెస్టారెంట్‌ని ప్రారంభించింది. హైదరాబాదీ బిర్యానీతోపాటు చైనీస్‌ మరియు ఇండియన్‌ వంటకాల్ని ఆహార ప్రియుల కోసం అందిస్తోంది. వెజ్‌, నాన్‌ వెజ్‌ డిషెస్‌, తాలీస్‌, స్నాక్స్‌, చాట్‌ ఐటమ్స్‌, సలాడ్స్‌, ఫ్రెష్‌ జ్యూసెస్‌, డిజర్ట్స్‌ మరియు బార్బిక్యూస్‌ ఇక్కడ అందుబాటులో వుంటాయి. దుబాయ్‌ షార్జాలలో తమ వంటకాల్ని ఆహార ప్రియుల కోసం సిద్ధంగా వుంచుతోంది డెక్కన్‌ హైద్రాబాదీ దమ్‌ బిర్యానీ రెస్టారెంట్‌. బర్త్‌డే పార్టీలు, ఫ్యామిలీ ఈవెంట్స్‌కి సైతం క్యాటరింగ్‌ సౌకర్యం అందుబాటులో వుందని నిర్వాహకులు వెంకట రమణ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com