తెలంగాణలో జూడాల ఆందోళన
- June 17, 2019
హైదరాబాద్: కోల్‌కత్తాలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనకు తెలంగాణ వైద్యులు మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓపి సేవలను నిలిపివేసి నిరసన చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు అత్యవసర సేవల మినహా ఓపి సేవలను బహిష్కరించారు. ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఉస్మానియాకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సేవలందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండ్ నాగేందర్ తెలిపారు.
మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వైద్యుల ఆందోళన కొనసాగుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..