తైఫ్‌ సీజన్‌ కోసం 700 ఇన్‌స్పెక్షన్స్‌ చేపట్టిన టూరిజం అధికారులు

- June 19, 2019 , by Maagulf
తైఫ్‌ సీజన్‌ కోసం 700 ఇన్‌స్పెక్షన్స్‌ చేపట్టిన టూరిజం అధికారులు

రియాద్‌: సౌదీ టూరిజం అధికారులు, కింగ్‌డమ్‌లో అతి పెద్ద ఫెస్టివల్‌ సీజన్స్‌లో ఒకటైన తైఫ్‌ సీజన్‌ కోసం ముందస్తు తనిఖీలు ముమ్మరం చేశారు. సౌదీ కమిషన్‌ ఫర్‌ టూరిజం అండ్‌ హెరిటేజ్‌ - తైఫ్‌, హోటల్స్‌లోనూ రిసార్టులు అలాగే రెసిడెన్షియల్‌ యూనిట్స్‌, టూరిస్ట్‌ లాడ్జ్‌లలో ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్‌ 1 నుంచి 30 రోజులపాటు తైఫ్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం లేకుండా, పూర్తిస్థాయిలో సందర్శకులకు ఆహ్లాదకరంగా వుండేలా తైఫ్‌ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com