పదవతరగతి అర్హతతో ఇస్రోలో టెక్నీషియన్ ఉద్యోగాలు.. జీతం. రూ.69,100

- June 19, 2019 , by Maagulf
పదవతరగతి అర్హతతో ఇస్రోలో టెక్నీషియన్ ఉద్యోగాలు.. జీతం. రూ.69,100

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సంస్థకు చెందిన లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్స్‌ సెంటర్‌లో 41 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. జూన్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టును బట్టి వేతనం రూ.18,000 నుంచి 69,100 మధ్య ఉంటుంది. ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ప్లంబర్, మెకానికల్, హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, కేటరింగ్ అటెండెంట్ వంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇస్రో. పదవతరగతితో పాటు ఐటీఐ పాసైనవారు లిక్విడ్ ప్రపలషన్ సిస్టమ్స్ సెంటర్-LPSC అధికారిక వెబ్‌సైట్‌లో జులై 2 మధ్యాహ్నం 2 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 41
ఫిట్టర్ : 10.. ఎలక్ట్రానిక్ మెకానిక్ : 04.. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్: 01.. టర్నర్ : 03.. మెషినిస్ట్ : 01.. వెల్డర్ : 01.. ప్లంబర్ : 01.. మెకానికల్ : 04.. హెవీ వెహికల్ డ్రైవర్ : 04.. లైట్ వెహికల్ డ్రైవర్ : 01, కేటరింగ్ అటెండెంట్ : 11.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 18
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జులై 02.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com