సినిమాల్లో నటిస్తూ.. డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తూ..
- June 19, 2019
బ్రతకడానికి ఉద్యోగం కావాలి.. నటించడానికి సినిమా కావాలి. ఒకటి వృత్తి.. మరొకటి ప్రవృత్తి. సినిమాల్లో చిన్న పాత్ర దొరికినా ఎంతో సంతోషం. డబ్బుల కోసం కాదు.. నటన అంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూస్తు పెరిగి పెద్దవాడయ్యాడు. సినిమాల్లో ఓ చిన్న పాత్ర అయినా వేయాలని ఎన్నో కలలు కన్నాడు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా నటిస్తున్నాడు. అలా వచ్చిందే సల్మాన్ ఖాన్ ‘భారత్’ అనే సినిమాలో చేతన్ రావుకి వచ్చిన అవకాశం. సావధాన్ ఇండియా, దిల్లీ క్రైమ్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ నటన పట్ల తనకున్న కోరికను నెరవేర్చుకుంటున్నాడు.
అయితే సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. చేతన్ రావు చేస్తున్న పనిని ప్రశంసిస్తూ రాజేష్ అనే వ్యక్తి అతడి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. ఫుడ్ ఆర్డర్ చేసిన రాజేష్ అది తీసుకు వచ్చిన చేతన్ రావుని చూసి షాకయ్యారు. మీరు భారత్ సినిమాలో నటించారు కదా అని అనేసరికి తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది అని చేతన్ సంతోషపడ్డాడు.
ఈ విషయాన్ని రాజేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సినిమాల్లో సరైన అవకాశాలు లేక ఆయన పార్ట్ టైం డెలివరీ బాయ్‌గా పని చేస్తూ కడుపునింపుకుంటున్నారు. ఇలాంటి వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది అని పేర్కొన్నారు. చేతన్ రావు దిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. కానీ సినిమాల్లో ఏ చిన్న పాత్ర దొరికినా ఎంతో ఇష్టంతో చేస్తాను అని అంటున్నాడు చేతన్. నటన అంటే ఆసక్తి. నటనలో శిక్షణ తీసుకునేంత స్తోమత లేదు. అందుకే టీవీలోని కార్యక్రమాలు చూస్తూ నటన నేర్చుకున్నానని చెబుతాడు. ముందు స్పాట్ బాయ్‌గా పని చేశానని, ఆ తరువాత చిన్న చిన్న పాత్రల కోసం ఆడిషన్స్‌కు వెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు చేతన్.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







