ఓపెన్ వర్క్ ప్లేసెస్‌లో సమ్మర్ వర్కింగ్ అవర్స్ ప్రకటన
- June 19, 2019
దోహా: మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్, ఓపెన్ వర్క్ ప్లేసెస్‌లో సమ్మర్ సందర్భంగా స్పెషల్ వర్కింగ్ అవర్స్‌ని ప్రకటించింది. ఆగస్ట్ 31 వరకు ఈ ప్రత్యేక పని గంటలు అమల్లో వుంటాయి. జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు పని గంటలు అమల్లో వుంటాయనీ, ఉదయం 11.30 నిమిషాలకు పని ఆపేసి, తిరిగి మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే పని ప్రారంభించాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంప్లాయర్స్ వర్కింగ్ అవర్స్ టైమ్ టేబుల్ని తయారు చేసుకుని, దాన్ని వర్క్ ఏరియాలో అందుబాటులో వుంచాలని అధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







