ఇరాన్ మీదుగా విమానాలు నడపొద్దు
- June 22, 2019
వాషింగ్టన్: ఇరాన్ గగనతలంపై అమెరికన్ విమానాల ప్రయాణాలను నిషేధిస్తూ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఇరాన్ గగనతలంపై సంచరిస్తున్న డ్రోన్‌ను ఇరాన్ దళాలు కూల్చివేసిన నేపథ్యంలో ఎఫ్‌ఎఎ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సైనిక కార్యకలాపాలు పౌర విమానయానానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ గగనతలం మీదుగా విమానాల ప్రయాణాన్ని నిషేధించటంతో ఉత్తర, అమెరికా నుండి తూర్పు ఆసియా దేశాలకు వచ్చే విమానాలపై తీవ్ర ప్రభావం పడనుంది. డ్రోన్ కూల్చివేత నేపధ్యంలో అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ న్యూయార్క్ నుండి ముంబయి వచ్చే తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించే తమ విమాన సర్వీసులను మార్గంలో భద్రత, సురక్షిత పరిస్థితులను సమీక్షించిన అనంతరం పున్ణప్రారంభిస్తామని వెల్లడించింది. అంతకు ముందు అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ విమానాలు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించబోవని ప్రకటించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







