అమెరికాలో భారీ వర్ష బీభత్సం
- June 22, 2019
అట్లాంటా: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను తుఫాను కుదిపేస్తుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ టెక్సాస్ నుంచి అలబామా వరకూ అనేక చోట్ల గాలుల తీవ్రతకు విద్యుత్ లైన్ల పైన, భవనాలపై చెట్లు కూలిపడ్డాయి. గంటకు 137 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల వల్ల టెక్సాస్లోని గ్రీన్విల్ నగరంలో అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరి పోయాయి. అక్కడ ఉన్న మిసోరి నది పరివాహక ప్రాంతంలో వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒహియోలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో హైవేలపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరదల వల్ల రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. దీంతో ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ మధ్య సర్వీసులు నిలిచిపోయాయి. డెలవేర్ నది కూడా ప్రమాద స్థాయికి మించి పొంగి పొర్లుతుంది. దీంతో సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..