వస్త్ర ధారణపై సలాలా టూరిస్టులకు మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం సూచన

- June 24, 2019 , by Maagulf
వస్త్ర ధారణపై సలాలా టూరిస్టులకు మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం సూచన

మస్కట్‌: దోఫార్‌ గవర్నరేట్‌ని ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సందర్శించే టూరిస్టులకు మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం కీలకమైన సూచన చేసింది. స్థానిక సంప్రదాయాల్ని గౌరవించి, వస్త్ర ధారణ పద్ధతిగా వుండాలన్నదే ఆ కీలక సూచన. దీనికి సంబంధించి మినిస్ట్రీ 50,000 లీఫ్‌లెట్స్‌ని కూడా విడుదల చేసింది. డ్రెస్సింగ్‌ విషయంలో అవగాహన కల్పించేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలకూ ఈ మేరకు సమాచారమిచ్చింది మినిస్ట్రీ. జూన్‌ 21న ప్రారంభమైన ఈ ఖరీఫ్‌ సీజన్‌ సెప్టెంబర్‌ 21 వరకు కొనసాగుతుంది. మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం - డైరెక్టర్‌ ఆఫ్‌ టూరిజం అవేర్‌నెస్‌ అమినా అల్‌ బలౌషి మాట్లాడుతూ, మినిస్ట్రీ సూచనల మేరకు టూరిస్టులు వ్యవహరించాలని కోరారు. ఇస్లామిక్‌ సంప్రదాయాల్ని ఇబ్బంది పెట్టేలా వస్త్ర ధారణ వుండకూడదని మినిస్ట్రీ స్పష్టంగా తన సూచనల్లో పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com