Facebook Libra క్రిప్టోకరెన్సీ, భారత్ కు రావడం కష్టమే
- June 24, 2019
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానం బిట్ కాయిన్ కరెన్సీ లిబ్రాను ప్రభుత్వాలు, ఆర్ధిక దిగ్గజాల ఆమోదంతో మార్కెట్లోకి తీసుకొస్తోందనే వార్తలు ఓ ఊపు ఊపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని 2020లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, ఈ ప్రాజెక్టులో ప్రపంచ అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన వీసా ఇంక్, మాస్టర్ కార్డ్ ఇంక్, పేపాల్ హోల్డింగ్స్ ఇంక్, ఉబర్ టెక్నాలజీస్ భాగస్వామలుగా ఉండనున్నాయని తెలిపింది. ప్రపంచ దేశాలకు ఈ క్రిప్టోకరెన్సీని పరిచయం చేస్తామని తెలిపింది.అయితే ప్రపంచదేశాలకు ఇది పరిచయమైనా ఇండియాలో దీనికి బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేక్ పడే అవకాశాలు Facebookకి అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే Facebook ఇండియాలో కూడా లిబ్రా క్రిప్టోకరెన్సీ, కాలిబ్రా డిజిటల్ వ్యాలెట్ లాంచ్ చేయాలని చూస్తోంది. కానీ, ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా లీగల్ బిట్ కాయిన్ కరెన్సీని తీసుకురావాలనే Facebook ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం.. క్రిప్టోకరెన్సీకి దేశంలో అనుమతి లేదు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







