ఫుజారియా రోడ్డుపై స్పీడ్‌ లిమిట్‌ తగ్గింపు

- June 25, 2019 , by Maagulf
ఫుజారియా రోడ్డుపై స్పీడ్‌ లిమిట్‌ తగ్గింపు

ఫుజారియా: యూఏఈలోని ఓ ప్రముఖ రోడ్డుపై స్పీడ్‌ లిమిట్‌ని తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫుజారియా పోలీసులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. షేక్‌ మక్తౌమ్‌ బిన్‌ రషీద్‌ రోడ్డుపై వేగాన్ని తగ్గిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గంటకు 140 కిలోమీటర్ల వేగ పరిమితి వున్న ఈ రోడ్డుపై ఇకనుంచి గంటకు 120 కిలోమీటర్ల వేగ పరిమితి మాత్రమే వుంటుంది. జులై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అదనంగా గంటకు 20 కిలోమీటర్ల వేగానికి సంబంధించి బఫర్‌ స్పీడ్‌ కొనసాగుతుందని అదికారులు స్పష్టం చేశారు. యస్బా బైపాస్‌ రౌండెబౌట్‌ నుంచి తాబాన్‌ ఏరియా వరకు వున్న ఆర్టీరియల్‌ రోడ్డుపై ఈ పరిమితిని విధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com