రూమ్ మేట్పై హత్యాయత్నం: నిందితుడికి జైలు శిక్ష
- June 25, 2019
కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు తన రూమ్ మేట్పై హత్యాయత్నానికి పాల్పడిన నేరానికిగాను 10 ఏళ్ళ జైలు శిక్షకు గురయ్యాడు. న్యాయస్థానం నిందితుడికి పదేళ్ళ జైలు శిక్షతోపాటుగా 100,000 దిర్హామ్ల జరీమానా కూడా విధించింది. జరీమానా మొత్తాన్ని బాధిత వ్యక్తికి అప్పగించాలని ఆదేశించింది న్యాయస్థానం. గత ఏడాది అబుదాబీలో ఈ ఘటన జరిగింది. వర్కర్స్ నివసిస్తున్న అకామడేషన్లో చిన్న వాగ్వాదం ఇద్దరు సహచరుల మధ్య గొడవకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి, మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడి కారణంగా తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి, ఆసుపత్రిలో కొన్ని వారాలపాటు వైద్య చికిత్స పొందాల్సి వచ్చింది. దాడి చేసిన అనంతరం అక్కడినుంచి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించగా, అది చూసిన మరో కార్మికుడు పారిపోతున్న నిందితుడ్ని పట్టుకున్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుని నిందితుడు పై కోర్టులో సవాల్ చేయగా, పై కోర్టు కింది కోర్టు తీర్పుని సమర్థించింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







