యూఏఈ లాంగ్ టెర్మ్ వీసా విశేషాలివీ..
- June 25, 2019యూఏఈ:10 ఏళ్ళ గోల్డ్ కార్డ్ రెసిడెన్సీ స్కీమ్‌కి సంబంధించి దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ కొన్ని వివరాల్ని విడుల చేసింది. గత నెలలో ప్రవేశపెట్టిన ఈ గోల్డ్ కార్డ్‌ని ఇప్పటిదాకా 400 మంది వలసదారులు సొంతం చేసుకున్నారు. వీరిలో ప్రముఖ వ్యాపారవేత్తలున్నారు. పదేళ్ళ తర్వాత గోల్డ్ కార్డ్‌ని రెన్యువల్ చేసుకోవాల్సి వుంటుంది. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు, వ్యాలీడ్ మెడికల్ ఇన్స్యూరెన్స్‌ని కూడా కలిగి వుండాలి. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఈ గోల్డ్ కార్డ్ వ్యాలీడ్ అవుతుంది. బిజినెస్ ఫ్టార్స్ వున్నట్లయితే కేస్ టు కేస్ బేసిస్‌పై రివ్యూ చేయబడుతుంది. గోల్డ్ కార్డ్ వీసా కలిగినవారు దేశంలోకి స్వేచ్ఛగా వచ్చి తిరిగి వెళ్ళవచ్చు. దేశం వెలుపల ఎన్ని రోజులైనా వారు వుండడానికి వీలుంటుంది. గోల్డ్ కార్డ్తోపాటుగా, లాంగ్ టెర్మ్ వీసాకి సంబంధించి షార్టర్ పీరియడ్స్ ఆఫ్ వ్యాలిడితోనూ కేటగిరీస్ వున్నాయి. డాక్టర్లు, ఇన్వెస్టర్స్, స్పెషలిస్ట్స్లు, స్టూడెంట్స్ (95 శాతానికి పైగా గ్రేడ్ పొంది వుండాలి సెకెండరీలో. అలాగే యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి 3.75కి పైగా గ్రేడ్ వుండాలి) వంటివారికి లాంగ్ టెర్మ్ వీసా సౌకర్యం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం