యూఏఈ లాంగ్ టెర్మ్ వీసా విశేషాలివీ..
- June 25, 2019
యూఏఈ:10 ఏళ్ళ గోల్డ్ కార్డ్ రెసిడెన్సీ స్కీమ్‌కి సంబంధించి దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ కొన్ని వివరాల్ని విడుల చేసింది. గత నెలలో ప్రవేశపెట్టిన ఈ గోల్డ్ కార్డ్‌ని ఇప్పటిదాకా 400 మంది వలసదారులు సొంతం చేసుకున్నారు. వీరిలో ప్రముఖ వ్యాపారవేత్తలున్నారు. పదేళ్ళ తర్వాత గోల్డ్ కార్డ్‌ని రెన్యువల్ చేసుకోవాల్సి వుంటుంది. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు, వ్యాలీడ్ మెడికల్ ఇన్స్యూరెన్స్‌ని కూడా కలిగి వుండాలి. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఈ గోల్డ్ కార్డ్ వ్యాలీడ్ అవుతుంది. బిజినెస్ ఫ్టార్స్ వున్నట్లయితే కేస్ టు కేస్ బేసిస్‌పై రివ్యూ చేయబడుతుంది. గోల్డ్ కార్డ్ వీసా కలిగినవారు దేశంలోకి స్వేచ్ఛగా వచ్చి తిరిగి వెళ్ళవచ్చు. దేశం వెలుపల ఎన్ని రోజులైనా వారు వుండడానికి వీలుంటుంది. గోల్డ్ కార్డ్‌తోపాటుగా, లాంగ్ టెర్మ్ వీసాకి సంబంధించి షార్టర్ పీరియడ్స్ ఆఫ్ వ్యాలిడితోనూ కేటగిరీస్ వున్నాయి. డాక్టర్లు, ఇన్వెస్టర్స్, స్పెషలిస్ట్స్‌లు, స్టూడెంట్స్ (95 శాతానికి పైగా గ్రేడ్ పొంది వుండాలి సెకెండరీలో. అలాగే యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి 3.75కి పైగా గ్రేడ్ వుండాలి) వంటివారికి లాంగ్ టెర్మ్ వీసా సౌకర్యం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







