సలాలాను సందర్శించే టూరిస్టులకు సేఫ్టీ గైడ్‌ లైన్స్‌

- June 27, 2019 , by Maagulf
సలాలాను సందర్శించే టూరిస్టులకు సేఫ్టీ గైడ్‌ లైన్స్‌

మస్కట్‌: వేలాది మంది దోఫార్‌ గవర్నరేట్‌ని ఖరీఫ్‌ సీజన్‌లో సందర్శించడం జరుగుతుంటుంది. వేసవి తీవ్రతను తప్పించుకునేందుకు ఈ టూర్స్‌ వారికి ఎంతగానో ఉపయోగపడ్తాయి. ఇదిలా వుంటే, పెద్దయెత్తున దోఫార్‌ గవర్నరేట్‌కి వచ్చే ఖరీఫ్‌ టూరిస్టుల కోసం మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం కొన్ని గైడ్‌ లైన్స్‌ రూపొందించింది. వాహనాల్ని పరిమిత వేగంతో నడపాలనీ, ట్రాఫిక్‌ లైట్స్‌ని ఖచ్చితంగా వినియోగించాలని మినిస్ట్రీ తమ గైడ్‌ లైన్స్‌లో పేర్కొంది. రోడ్డుపై జంతువులు క్రాస్‌ చేసే అవకాశం వున్నందున అప్రమత్తంగా వుండాలనీ, వాటికి ఎలాంటి హానీ కలిగించవద్దని మినిస్ట్రీ సూచించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో తప్ప వాహనాల్ని ఎక్కడబడితే అక్కడ నిలుపకూడదు. లూసెన్స్‌ పొందిన క్రూయిజ్‌లను మాత్రమే వినియోగించాల్సి వుంటుంది. ఫోర్‌ వీల్‌ డ్రైవ్స్‌ని మాత్రమే ఉపయోగించాలనీ, తగినంత ఆహారం, మంచి నీళ్ళు, ఫ్యూయల్‌ అలాగే స్పేర్‌ టైర్‌ తప్పనిసరని గైడ్‌లైన్స్‌లో మినిస్ట్రీ పేర్కొంది. మరీ ముఖ్యంగా ప్రత్యేక వాహనాల్లో వెళ్ళేవారు తమ ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ కండిషన్‌ని పరిశీలించుకుని, అవసరమైన మరమ్మత్తులు ముందే చేయించుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com