టెలికామ్‌ టవర్‌పై అస్వస్థతకు గురైన కార్మికుడ్ని రక్షించిన అధికారులు

- June 27, 2019 , by Maagulf
టెలికామ్‌ టవర్‌పై అస్వస్థతకు గురైన కార్మికుడ్ని రక్షించిన అధికారులు

మస్కట్‌: టెలికమ్యూనికేషన్స్‌ వర్కర్‌ ఒకరు, కమ్యూనికేషన్‌ నెట్‌ వర్క్‌ టవర్‌పై అస్వస్థతకు గురవగా, అతన్ని అత్యంత చాకచక్యంగా పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) టీమ్‌ రక్షించింది. ముదైబిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎసిడిఎ వర్గాలు ఈ ఘటన గురించి వెల్లడిస్తూ కార్మికుడ్ని క్షేమంగా కిందికి దించామనీ, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పడం జరిగింది. అల్‌ షర్కియా గవర్నరేట్‌ పరిధికి చెందిన సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ - రెస్క్యూ అలాగే అంబులెన్స్‌ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పిఎసిడిఎ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కార్మికుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com