టీమిండియా ప్లేయర్స్ జెర్సీపై పెద్ద ఎత్తున ప్రచారం
- June 30, 2019
ఇప్పటివరకు బ్లూ మెన్ గా ఫ్యాన్స్ ముందుకు వచ్చిన టీమిండియా ప్లేయర్స్ జెర్సీ మారింది. కాసేపట్లో ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ టీం ఆరేంజ్ జెర్సీతో బరిలోకి దిగబోతోంది. దశాబ్దాల పాటుగా బ్లూ జెర్సీకి అలవాటు పడిన ఫ్యాన్స్ కొత్త జెర్సీలో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.
కాసేపట్లో ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో ముదురు నీలం, నారింజ రంగులోని జెర్సీలను ధరించనుంది. వరల్డ్ కప్ లో ఆడుతున్న జట్లలలో భారత్, ఇంగ్లండ్ నీలిరంగు దుస్తులతో బరిలోకి దిగుతున్నాయి. అయితే. ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు తలపడే మ్యాచ్‌లో టీమిండియా జెర్సీలు మారాయి. కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు ఎలా కనిపిస్తారో చూపిస్తూ ఫోటో షూట్ ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వీడియోలు, పోటోలు రావటంతో టీమిండియా జెర్సీలపై విపరీతమైన ప్రచారం జరిగింది. ఇంకాసేపట్లో లైవ్ లో తమ ఫేవరేట్ ప్లేయర్స్ ను కొత్త జెర్సీలో కనిపించబోతున్నారు.
టీమిండియా కొత్త జర్సీపై సోషల్ మీడియాలో రేటింగ్ ఇస్తున్నారు అభిమానులు. నీలం కలర్ తో పాటు ఆరేంజ్ కలర్ ఉండటంతో కాషాయికరణ జరిగిదంటూ విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జెర్సీపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాత్రం కొత్త జర్సీపై ప్రశంసలు కురిపించారు. 10కి ఎనిమిది పాయింట్లు ఇస్తానని అన్నాడు కోహ్లీ.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







