కిమ్ ని కలిసిన ట్రంప్
- June 30, 2019
ప్రపంచదేశాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ లు కలుసుకున్నారు. దక్షిణ, ఉత్తర కొరియా సరిహద్దులోని సైనిక రహిత గ్రామమైన పన్మున్ జోన్ గ్రామంలో ఇరువురు నేతలు కలిశారు. ట్రంప్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందని కిమ్ అనగా… మా ఇద్దరిమధ్య గొప్ప స్నేహబంధం ఉందని, ఇక్కడికి వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు ట్రంప్.
ఈ సందర్భంగా సరిహద్దుకు అటుగా ఉన్న ఉత్తరకొరియా భూభాగంలోకి కిమ్ తో కలిసి ట్రంప్ అడుగు పెట్టారు. ఈ సమావేశంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా పాల్గొని కిమ్ తో కరచాలనం చేశారు. మా సమావేశం దురదుష్టకరమైన గతాన్ని తొలగించి కొత్త భవిష్యతకు నాందిగా నిలుస్తుందని కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా మూడు దేశాల అధినేతలు నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా కనిపించారు. ఇది చారిత్రక సమావేశమని పరిశీలకులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..