కాబూల్:బాంబు పేలుళ్లు 16 మంది మృతి...

- July 01, 2019 , by Maagulf
కాబూల్:బాంబు పేలుళ్లు 16 మంది మృతి...

ఆప్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. తాలిబాన్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. అమెరికా ఎంబసీకి సమీపంలో కారు బాంబుతో పేలుళ్లకు తెగబడ్డారు. ఆ తర్వాత రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 16మంది చనిపోయారు. 100మందికి పైగా గాయపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ భవన సముదాయాలకు దగ్గరలోనే ఈ బాంబులు అమర్చారు.
బాంబు పేలుళ్లతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ లో నిత్యం బాంబు దాడులు జరుగుతుంటాయి. ముష్కరమూకలు రక్తపుటేరులు పారిస్తుంటాయి. భద్రతా దళాలే లక్ష్యంగా అటాక్స్ చేస్తుంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి అలజడి సృష్టిస్తుంటారు.
జనాలు ఎక్కువగా ఉన్న చోట ఉగ్రవాదులు బాంబు పేల్చారు. గాయపడిన వారిలో 50మంది పిల్లలు ఉన్నారు. వారంతా స్కూల్ పిల్లలే. బాంబు బ్లాస్ట్ కి స్కూల్ భవనం అద్దాలు ముక్కలయ్యాయి. అవి పిల్లలపై పడ్డాయి. బాంబు బ్లాస్ట్ సమయంలో పిల్లలు క్లాస్ రూమ్స్ లో ఉన్నారు. గాయపడిన పిల్లలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాబూల్ లో తరుచుగా జరుగుతున్న బాంబు పేలుళ్లకు పిల్లలు బలవుతున్నారు. పిల్లలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఆఫ్ఘనిస్తాన్ తయారైంది. అంతర్గత ఘర్షణల కారణంగా అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 20 ఏళ్లుగా ఆప్ఘనిస్తాన్.. అంతర్గత ఘర్షణలతో అట్టుడుకుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com