ఈ ఉల్లంఘనకు పాల్పడితే, ఇకపై మూడింతల జరీమానా!
- July 02, 2019
యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాహనదారులను ఉద్దేవించి ఓ హెచ్చరికను జారీ చేసింది పోలీస్ కార్లు, అఫీషియల్ పెరేడ్ వెహికిల్స్, అంబులెన్సెస్ వంటి ఎమర్జన్సీ వెహికిల్స్‌కి దారి ఇవ్వనిపక్షంలో 3,000 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారన్నది ఆ హెచ్చరిక సారాంశం. ఉల్లంఘనకు పాల్పడితే వాహనాల్ని 30 రోజుల పాటు సీజ్ చేస్తారు. వాహనాన్ని నడిపే వ్యక్తికి ఆరు ట్రాఫిక్ పాయింట్లు కూడా విధించడం జరుగుతుంది. జులై 1 నుంచి ఈ కొత్త జరీమానా అమల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో మరిన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు అమల్లోకి వస్తాయనీ, వాహనదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనల్ని ఉపేక్షించేది లేదని అధికార యంత్రాంగం చెబుతోంది. ఎమర్జన్సీ సైరన్‌ని రోడ్ యూజర్స్ గమనించాలని, ఎమర్జన్సీ వెహికిల్సకి దారి ఇవ్వాలనీ, అది పౌరులు, నివాసితుల బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..