ఇజ్రాయిల్:లిక్కర్ బాటిల్స్ పై గాంధీ ఫోటోను ముద్రించడం తప్పే...క్షమించండి

- July 03, 2019 , by Maagulf
ఇజ్రాయిల్:లిక్కర్ బాటిల్స్ పై గాంధీ ఫోటోను ముద్రించడం తప్పే...క్షమించండి

ఇజ్రాయిల్:బీరు బాటిల్స్ పై జాతిపిత మహాత్మ గాంధీ బోమ్మను ముద్రించిన ఇజ్రాయిల్ కంపనీ భారత దేశానికి క్షమాపణాలు చెప్పింది. భారతీయుల సెంటిమెంట్‌ను ఆగౌరవ పరిచినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్టు మల్కా బీర్స్ కంపెనీ ప్రభుత్వాన్ని కోరింది. మహాత్మగాంధీకి తాము అత్యున్నత గౌరవ ఇస్తామని, జరిగిన దానికి చింతిస్తున్నామని తెలిపారు.

కాగా మే 8 వ తేదిన ఇజ్రాయిల్ 71 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గుర్తుగా మల్కా బీర్స్ అనే లిక్కర్ కంపనీ గాంధీ బోమ్మను లిక్కర్ బాటిళ్లపై ముద్రించింది.కాగా లిక్కర్ బాటిల్స్ పై గాంధిని గౌరవించడంలో భాగంగానే ముద్రించినట్టు తెలిపింది. దీంతో రాజ్యసభలో ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు.దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విదేశీ వ్యవహారల శాఖ మంత్రి జయశంకర్‌ను దృష్టికి తీసుకెళ్లి దీనిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భారత ఎంబసీ అధికారులు ఇజ్రాయిల్ ప్రభుత్వానికి అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలోనే కంపెనీ దిగివచ్చింది.గాంధి బొమ్మతో ఉన్న లిక్కర్ బాటిల్స్ సరఫరాను నిలిపివేశామని తెలిపారు.కాగా మాజీ ప్రధాని డేవిడ్ బేన్ గురియన్‌తోపాటు పలువురు మాజీ ప్రధానులు, జైన మత గురువు ఫోటోలను లిక్కర్ బాటిల్స్ పై ముద్రించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com