ఈ ఫుడ్ మీ చర్మాన్ని మెరిపిస్తుంది..
- July 06, 2019
ఆరోగ్యమైన, అందమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్టీఫీషియల్ మెరుపులు అద్దుతుంటారు. అలా కాకుండా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీసొంతమవుతుంది. ఆ ఆహారపదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
చేపలు, సోయా ఉత్పత్తులు.. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, కుంగిబాటు, డిప్రెషన్ దూరమవుతాయి. ఈ కారణంగా చర్మం తాజాగా నిగనిగలాడుతుంటుంది.
బొప్పాయి.. విటమిన్ సి, ఇ బీటాకెరొటిన్ అధికంగా ఉండే వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మంపైన ఉండే మృతకణాలు దూరమై అందంగా మారతారు.
క్యారెట్.. విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం కళ్లు, చర్మానికి ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అంతగా ఉండదని చెబుతున్నారు. వీటితో పాటు.. ఎర్ర క్యాప్సికమ్ కూడా మేలు చేస్తుందని.. ఇందులోని కెరొటినాయిడ్‌లు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్స్.. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఈ చాక్లెట్స్.. చర్మాన్ని మృదువుగామారుస్తాయి. పాలకూర.. శరీరంలోని వ్యర్థాలను బయటకుపంపడంలో పాలకూర బాగాపనిచేస్తుంది. కాబట్టి.. వీటిని రెగ్యులర్‌గా తీసుకుని ఆరోగ్యవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉండమంటూ వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







