బీచ్ గోయర్స్‌కి అబుదాబీ పోలీస్ వార్నింగ్
- July 06, 2019
అబుదాబీలో బీచ్ గోయర్స్‌కి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు ఆకస్మికంగా మారుతున్నందున, బీచ్ గోయెర్స్ అప్రమత్తంగా వుండాలని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో స్విమ్మింగ్ చేయరాదనీ, అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే సహాయక సిబ్బందికి సమాచంర ఇవ్వాలని అధికారులు సూచించారు. సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ - ఎమర్జన్సీ అండ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జాయెద్ మొహమ్మద్ అల్ హజ్రి మాట్లాడుతూ, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి సేదతీరేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారనీ, ఈ క్రమంలో అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయని అన్నారు. బీచ్ గోయర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వాల్సి వుంటుందని ఆయన స్పస్టం చేశారు. సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్స్‌ని దాటి కొందరు సముద్రంలో నాన్ స్విమ్ ఏరియాస్‌లోకి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. లైఫ్ గార్డ్స్, బీచ్ గోయర్స్‌ని వార్న్ చేస్తున్నా పట్టించుకోవడంలేదని అన్నారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







