యూఏఈలో అగ్ని ప్రమాదం
- July 06, 2019
అబుదాబీ సివిల్ డిఫెన్స్, క్యాపిటల్ ముష్రెక్ ప్రాఆంతంలోని ఓ విల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి 21 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. విల్లా ఫస్ట్ ఫ్లోర్‌లో మొత్తం 9 రెసిడెన్షియల్ యూనిట్స్ వున్నాయి. ఇక్కడే అగ్ని ప్రమాదం జరగగా, 21 మందిని క్షణాల్లో వెకేట్ చేయించగలిగారు అధికారులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ - డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సలెమ్ హాషిమ్ మాట్లాడుతూ, క్షేమంగా బయటపడ్డవారిలో రెండు నెలల చిన్నారి నుంచి 47 ఏళ్ళ వయసుగల వ్యక్తుల వరకు వున్నారని తెలిపారు. పొగ పీల్చడం కారణంగా అస్వస్థతకు గురైనవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా వుండేందుకు ప్రతి ఒక్కరూ సేఫ్టీ నిబంధనల్ని పాటించాలని అల్ హబాషి సూచించారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరుగుతుందని తెలిపారాయన.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







