ఆధార్ ఆన్ ఎరైవల్పై హర్షం వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు
- July 06, 2019
బహ్రెయిన్:కింగ్‌డమ్‌లోని భారతీయ వలసదారులంతా 'ఆధార్ ఆన్ ఎరైవల్' ప్రపోజల్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ఎన్నారైలుకు ఆధార్ ఆన్ ఎరైవల్ అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నారైలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఆరు నెలలు వుంటేనే ఆధార్ దక్కుతుందనే నిబంధన ఇప్పటిదాకా అమల్లో వున్న విషయం విదితమే. కాగా, తాజా ప్రపోజల్‌పై హర్షం వ్యక్తం చేసిన భారతీయ వలసదారుడు రామ్‌శంకర్ మహేశ్వరన్, ఆధార్ లేకపోవడంతో ఎన్నారైలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్ పొందడం అలాగే చాలా విషయాలకు ఆధార్‌తో లంకె కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయనీ, కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమకు ఉపశమనం కలిగిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







